ఓవైపు భారత్‌ను దువ్వుతూనే మరోవైపు పాక్‌ను అమెరికా లాలిస్తోంది. పాక్‌కు అమెరికా చేస్తున్న ఆర్థిక సాయాన్ని భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ వాడుతుందని తెలిసినప్పటికీ ఒబామా సర్కారు ఏమాత్రం లెక్కచేయడం లేదు. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఒక్కసారి కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. మరోవైపు తమకు వ్యతిరేకంగా ఏకమవుతున్న రష్యా, చైనాలతో భారత్ కూడా జతకడితే అమెరికాకు మరింత ముప్పు అని భావించే ఒబామా భారత్‌ను దువ్వే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తాజాగా పౌర, మిలటరీ సాయం పేరుతో పాకిస్తాన్‌కు అమెరికా 6 వేల కోట్ల రూపాయాల ఆర్థికసాయాన్ని అందించేందుకు అంగీకరించింది. ఇందులో సైనిక సాయమే రూ. 1633 కోట్లు ఉండటం గమనార్హం. దీనిపై భారత్ తన వ్యతిరేకతను తెలిపినా అమెరికా ఏమాత్రం లెక్కచేయడం లేదు.