Advertisementt

ఆగిపోయిన త్రిష సినిమా ప్రారంభం..!

Wed 04th Feb 2015 07:34 AM
trisha,lady oriented movie,poonam bajwa,nikisha patel  ఆగిపోయిన త్రిష సినిమా ప్రారంభం..!
ఆగిపోయిన త్రిష సినిమా ప్రారంభం..!
Advertisement
Ads by CJ

చాలాకాలం క్రితం మొదలై ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయిన త్రిష సినిమా మళ్ళీ మొదలవుతోంది. ఆమె కాబోయే భర్త ఫైనాన్స్ చేస్తే ఈ ప్రాజెక్ట్ మొదలవుతోందని అంతటా వినపడుతోంది. త్రిష కాబోయే భర్త వరుణ్ మణియన్ ఓ పేరొందిన నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ సినిమా పేరు ఏమిటంటే 'భోగి'. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోయిన్ త్రిష ప్రధానపాత్రలో రూపొందుతున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'భోగి'. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు పూనమ్ బజ్వా, ఒలియాలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సురేఖావాణి మరో కీలకపాత్రలో నటిస్తోంది. దశాబ్దన్నర కాలంగా హీరోయిన్ గా వెలుగుతోన్న ఈ చెన్నై సుందరి త్రిష కెరీర్లో తొలిసారి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'భోగి'. తెలుగులో ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకునిగా రూపొందుతున్న 'రమ్'(రంభ, ఊర్వసి, మేనక) చిహ్రం కూడా చాలా కాలంగా ఆగిపోయింది. ఇందులో త్రిషతో పాటు చార్మి,  నికిషా పటేల్ లు నటిస్తున్నారు. మరి ఈ చిత్రం కూడా ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఆగిపోయింది. మరి ఈ చిత్రానికి కూడా త్రిష కాబోయే భర్త ఫైనాన్స్ చేస్తాడేమో చూడాల్సివుంది..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ