Advertisementt

'బందిపోటు' రావడం లేటవుతోంది..!

Wed 04th Feb 2015 05:36 AM
allari naresh,bandipotu,temper,sampoornesh babu  'బందిపోటు' రావడం లేటవుతోంది..!
'బందిపోటు' రావడం లేటవుతోంది..!
Advertisement
Ads by CJ

అల్లరినరేష్, ఇషా జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇ.వి.వి.సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్న చిత్రం 'బందిపోటు'. 'దొంగల్ని దోచుకో' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ సరైన టైం లో రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. చివరకు ఫిబ్రవరి 6 న విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేటవ్వుతుండటంతో ఈ చిత్రం విడుదల రెండు వారాలు లేటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 'టెంపర్' రిలీజ్ అయిన వారం తర్వాత ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రంలో సంపూర్నేష్  బాబు, సప్తగిరి వంటి కమెడియన్లు నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కామెడీ సరికొత్త పుంతలు తొక్కుతుందనే ఆశతో యూనిట్ నమ్మకంగా ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ