తెలుగు కమెడియన్ అండ్ కామెడి ఆర్టిస్ట్ ఎమ్మెస్ నారాయణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయన ఇక లేరు అనే వాస్తవాన్ని ఇప్పుడుప్పుడే అందరూ జీర్ణించుకుంటున్నారు. అయితే ఆయన చనిపోయే నాటికి చాలా సినిమాలలో ఆయన చేయాల్సిన పాత్రలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. సగం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలు కొన్నయితే, ఆయన డబ్బింగ్ చెప్పాల్సిన పాత్రలు మరికొన్ని ఉంటాయి. వాస్తవానికి ఎమ్మెస్ నారాయణ కామెడి నటనతో పాటు ఆయన డైలాగ్ డిక్షన్, డైలాగ్ డెలివరీకి ఎంతో స్పెషాలిటీ ఉంది. అటువంటి వాయిస్ ను ఎవరి చేత చెప్పించాలా? అని కొందరు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆయన మరణించే సమయానికి ఆయన చేస్తున్న పాత్రలు పదికి పైనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆయన మీద చిత్రీకరించాల్సిన సీన్లు అన్ని పూర్తయ్యాయి. అయితే ఆయన డబ్బింగ్ మాత్రం పూర్తికాలేదు. దీంతో యూనిట్ సభ్యులు ఆయన పాత్రకు వేరే ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్టు ద్వారా డబ్బింగ్ చెప్పించాలని ఆలోచిస్తున్నారట. మరి చివరకు త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.