ఆ మధ్యన రామ్ చరణ్, అల్లుఅర్జున్ లు హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం రానుందని, దానికి 'చరణ్-అర్జున్' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత 'ఎవడు' చిత్రానికి సైతం అదే టైటిల్ అని మీడియాలో ప్రముఖంగా వినిపించింది. అదీ నిజం కాలేదు. అయినా కూడా అల్లుఅరవింద్ కు ఈ 'చరణ్-అర్జున్' టైటిల్ పై మమకారం పోలేదు. తాజాగా ఆయన ఈ టైటిల్ ను మరోసారి ఫిల్మ్ ఛాంబర్ లో రెన్యువల్ చేయించాడు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ముల్టీస్టారర్స్ ఊపందుకుంటున్నాయి. అయినా ఒక సీనియర్ స్టార్ తో కలిసి మరో యంగ్ స్టార్ నటించే చిత్రాలు, లేదా ఫ్యామిలీ మొత్తం నటించే చిత్రాలు మాత్రమే వస్తున్నాయి. మరి రామ్ చరణ్- అల్లుఅర్జున్ వంటి ఒకే జనరేషన్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మంచి స్టొరీ దొరికితే ఇదే కాంబినేషన్ లో మల్టీస్టారర్ చేయడానికి అల్లుఅరవింద్ సముఖంగా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.