Advertisementt

ఖరారు చేసిన గోపీమోహన్..!

Wed 04th Feb 2015 03:15 AM
gopimohan,alluarjun,ramcharan,brahmanandam  ఖరారు చేసిన గోపీమోహన్..!
ఖరారు చేసిన గోపీమోహన్..!
Advertisement
Ads by CJ

గత వారం రోజులుగా రామ్ చరణ్-శ్రీనువైట్ల చిత్రానికి కోనవెంకట్, గోపిమోహన్ లు పనిచేయనున్నట్లు, వారి మధ్య రామ్ చరణ్ అయోధ్య కుదిర్చినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రచయిత గోపీమోహన్ ఈ విషయాన్ని ద్రువీకరించడంతో అది నిజమేనని ఖరారు అయింది. గోపీమోహన్ తాము చేస్తున్న ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.. అనిల్ సుంకర గారి ఎకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నేను దర్శకత్వం వహించే సునీల్ సినిమా ఫిబ్రవరిలోనే మొదలవుతుంది. దిల్ రాజు, వాసువర్మ, సునీల్ ల చిత్రానికి ప్యార్ లర్ గానే ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. కోన గారితో కలిసి సునీల్ చిత్రానికి విభిన్నమైన కథను రాశాం. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంటర్ టైన్మెంట్ తో కూడిన ఓ హైవోల్టేజీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథను అందిస్తున్నాం. రామ్ చరణ్-శ్రీనువైట్ల చిత్రానికి కూడా మేము రచన చేస్తున్నాం. దానయ్య గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. 10ఏళ్ళు కలిసి పని చేసిన మేము కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల గత సంవత్సరం కలిసి పని చేయలేకోయాం. హీరో రామ్ చరణ్ ఉన్నత మనసుతో కోన గారిని, వైట్ల గారిని కలిపిన విధానం అభినదించదగ్గ విషయం. రామ్ చరణ్, శ్రీనువైట్ల, సమంతల చిత్రానికి చాలా మంచి కథతో శ్రీనువైట్ల గారి గత చిత్రాలకు భిన్నంగా, కొత్త కథనంతో రూపకల్పన జరుగుతోంది. అయితే అందులో మా మార్క్ వినోదం కూడా ఉంటుంది. బ్రహ్మానందం గారి పాత్ర ప్రత్యేకత కలిగివుంటుంది. ఇక రామ్ చరణ్ మాతో ఎంతో ఇష్టపడి గత ఆరునెలలుగా చేయించుకుంటోన్న ఇంకో సబ్జెక్ట్ కూడా ఉంది. శ్రీనువైట్ల సినిమా అనంతరం ఆ సినిమా కూడా ఉంటుంది.. అని తెలిపాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ