Advertisementt

ఆ మాజీ ఎంపీపై సీఎంకు సానుభూతి..!!

Tue 03rd Feb 2015 10:04 AM
vivek,warangal mp seat,kcr,v6  ఆ మాజీ ఎంపీపై సీఎంకు సానుభూతి..!!
ఆ మాజీ ఎంపీపై సీఎంకు సానుభూతి..!!
Advertisement
Ads by CJ

కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పుడు వరంగల్‌ సీటు హాట్‌టాపిక్‌గా మారింది. ఈస్థానం నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణ గురించి కాంగ్రెస్‌ హైకమాండ్‌తో గట్టిగా పోరాడిన వివేక్‌ తదనాంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ప్రత్యేక రాష్ట్రం లభించిన తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయిన ఆయన బాల్కసుమన్‌ వంటి అనామకుడి చేతిలో ఓడిపోయారు. అయితే ఆయన కాంగ్రెస్‌ తరఫున టీఆర్‌ఎస్‌పై పోరాడినా కేసీఆర్‌కు మాత్రం వివేక్‌పై ఇంకా సానుభూతి ఉన్నట్లు సమాచారం. వివేక్‌ కుటుంబ సభ్యులు, వారి ఎలక్ట్రానిక్‌ చానల్‌ తెలంగాణ కోసం చేసిన పోరాటం గుర్తించిన కేసీఆర్‌ మళ్లీ ఆయన్ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలిసింది. అటు తర్వాత వరంగల్‌నుంచి వివేక్‌ను బరిలోకి దించాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అటు టీఆర్‌ఎస్‌కు ఇటు వివేక్‌కు కలిసొచ్చినట్లే..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ