Advertisementt

కేసీఆర్‌తో సై అంటే సై అంటున్న పత్రిక..!!

Tue 03rd Feb 2015 07:55 AM
kcr,andhrajyothi,radhakrishna,vasthu  కేసీఆర్‌తో సై అంటే సై అంటున్న పత్రిక..!!
కేసీఆర్‌తో సై అంటే సై అంటున్న పత్రిక..!!
Advertisement

కేఆర్‌కు ఆంధ్రజ్యోతి పత్రికకు నడుమ రోజురోజుకూ వివాదం ముదురుతోంది. తెలంగాణలో ఏబీఎన్‌ చానల్‌ ప్రసారాలు నిలిచిపోవడానికి పరోక్షంగా కేసీఆరే కారణమని ఆ పత్రిక యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం అటు ఈనాడు ఇటు సాక్షి దినపత్రిక కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి మాత్రం ప్రభుత్వంతో సై అంటే సై అంటోంది. దీనికితోడు ఇటీవలె ఆ పత్రిక పేజీలు కలర్‌లో వస్తుండటంతో సర్క్యులేషన్‌ బాగా పెరుగుతున్నట్లు సమాచారం. ఇక సచివాలయానికి రెండు వీధిపోట్లు ఉన్న కారణంతో ప్రభుత్వ పాలన సక్రమంగా సాగడం లేదని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎర్రగడ్డలో కొత్త కార్యాలయం నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఎర్రగడ్డలో ప్రభుత్వం ఎంచుకున్న స్థలానికి పదిహేను వీధిపోట్లు ఉన్నాయని ఏబీఎన్‌ వార్త కథనం ప్రచురించింది. రెండు వీధిపోట్లు ఉన్నాయనే కారణంతో సచివాలయాన్ని పదిహేను వీధిపోట్లు ఉన్న స్థలానికి ఎలా మారుస్తారని ఆ పత్రిక ప్రశ్నించింది. మరి దీనికి కేసీఆర్‌ సర్కారు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement