Advertisementt

''ఉత్తమవిలన్'' పై క్లారిటీ..!

Tue 03rd Feb 2015 06:55 AM
kamalhasan,utthamavillain,jibran,balachandar  ''ఉత్తమవిలన్'' పై క్లారిటీ..!
''ఉత్తమవిలన్'' పై క్లారిటీ..!
Advertisement
Ads by CJ

విశ్వనాయకుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తోన్న 'ఉత్తమవిలన్' చిత్రం ఆడియోను మార్చి 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత లింగుస్వామి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలియజేసారు. ఈ చిత్రానికి 'రన్ రాజా రన్' చిత్రానికి సంగీతం అందించిన జిబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. అంతేకాదు.. కమల్ ప్రస్తుతం నటిస్తున్న 'ఉత్తమవిలన్'తో పాటు 'విశ్వరూపం2, పాపనాశం' చిత్రాలకు సైతం జిబ్రానే సంగీతాన్ని అందిస్తుండడం విశేషం. 'ఉత్తమవిలన్' చిత్రానికి ప్రముఖ కన్నడ నటుడు, కమల్ హాసన్ స్నేహితుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజాకుమార్, ఆండ్రియాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలను కమలే స్వయంగా అందిస్తున్నాడు. ఈ చిత్రంలో స్వర్గీయ బాలచందర్ తో పాటు కె.విశ్వనాథ్, ఊర్వశి తదితరులు నటిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ తో పాటు లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఎరోస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ