Advertisementt

పవన్ ను వద్దనుకున్న హీరోయిన్..!

Tue 03rd Feb 2015 06:51 AM
akshara hasan,pawan kalyan,sruthihasan,gabbar singh2  పవన్ ను వద్దనుకున్న హీరోయిన్..!
పవన్ ను వద్దనుకున్న హీరోయిన్..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సరసన నటించడం అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఆయనతో నటిస్తే ఆ సినిమా హిట్టయితే తమ కెరీర్ గ్రాఫ్ బాగుంటుందని వారి ఆశ. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఒక్క హిట్టు కూడా లేని శ్రుతిహాసన్ 'గబ్బర్ సింగ్ 2'తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో 'గబ్బర్ సింగ్2' పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా ఎంపిక చేసారు. అయితే ఈ ఆఫర్ మొదట శ్రుతిహాసన్ చెల్లి అక్షరహాసన్ కు వచ్చిందట. అయితే ఆమె నిర్మొహమాటంగా తిరస్కరించిందని సమాచారం. కెరీర్ మొదట్లోనే అంత పెద్ద స్టార్ తో చేస్తే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు తగిన విధంగా మన పెర్ఫార్మెన్స్ లేకుంటే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అందుకే ఆ ఆఫర్ సున్నితంగా తిరస్కరించినట్లు అక్షరహాసన్ చెబుతోంది. అయితే అక్కా చెల్లిలిద్దరితో రొమాన్స్ చేసే అవకాశం మాత్రం పవన్ కు మిస్సయిందనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ