టాలీవుడ్ లో ఫిబ్రవరి 13 వ తేదీ దగ్గర పడేకొద్ది 'టెంపర్' మేనియా పెరుగుతోంది. కాగా ఈ చిత్రం విడుదలయ్యే థియేటర్లలో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'రుద్రమదేవి' ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు. 'టెంపర్' వంటి మాస్ చిత్రం, అందునా ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఆడే థియేటర్లలో 'రుద్రమదేవి' థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడం వల్ల తమ సినిమా మరింత మందికి చేరువ అవుతుందనే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నాడు. అనుకున్న స్థాయిలో బిజినెస్ కాక ఇబ్బందులు పడుతున్న గుణశేఖర్ ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా నటిస్తున్న అల్లుఅర్జున్ ఇమేజ్ ను బాగా క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అలాగే 'టెంపర్' ఆడే థియేటర్లలో ట్రైలర్ విడుదల చేయడం వంటివి చేస్తూ సినిమాపై క్రేజ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాడు.