Advertisementt

మణిరత్నం టాలెంట్‌కి పరీక్ష ఈ సినిమా..!

Mon 02nd Feb 2015 06:47 AM
maniratnam,oru kanmani,pc sreeram,rehman  మణిరత్నం టాలెంట్‌కి పరీక్ష ఈ సినిమా..!
మణిరత్నం టాలెంట్‌కి పరీక్ష ఈ సినిమా..!
Advertisement
Ads by CJ

దర్శకదిగ్గజం, క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం ఈ మధ్య ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఆయన పనైపోయిందనే విమర్శలు వస్తున్నాయి. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న మణిరత్నం..తన టాలెంట్‌ని చూపేందుకు మరోసారి సిద్ధమవుతున్నాడు. సాదారణంగా సినిమా తీయడానికి కనీసం ఒకటి, రెండేళ్ళు తీసుకునే మణి..తాజాగా రూపొందిస్తున్న ‘ఒరు కన్మణి’ చిత్రం షూటింగ్‌ను కేవలం మూడు నెలల్లో పూర్తి చేశాడు. ఈ చిత్రంలో మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌లు జంటగా నటిస్తున్నారు. వీరిద్దరికీ తమిళంతో పాటు మలయాళంలో కూడా మంచి గుర్తింపు ఉండటంతో ఈ చిత్రాన్ని ఆయన ద్విభాషా చిత్రంగా తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో డబ్బింగ్‌ చేస్తున్నాడు. చిత్రాన్ని ఎలాగైనా ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు మణి సన్నాహాలు చేస్తున్నాడు. పి.సి. శ్రీరామ్‌, ఎ.ఆర్‌. రెహ్మాన్‌ వంటి దిగ్గజాలు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. మొత్తానికి తన కెరియర్‌ డిసైడింగ్ సినిమాగా మణి ఈ మూవీని భావిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ