Advertisementt

హై‘టెంపర్‌’లో ఎన్టీఆర్‌..!

Mon 02nd Feb 2015 06:34 AM
ntr,temper,50 crores market,puri jagannadh  హై‘టెంపర్‌’లో ఎన్టీఆర్‌..!
హై‘టెంపర్‌’లో ఎన్టీఆర్‌..!
Advertisement
Ads by CJ

ఆడియో హిట్‌ అయితే సగం సినిమా హిట్టయినట్లే. ఇక ట్రైలర్స్‌కు కూడా మంచి క్రేజ్‌ వస్తే..ఇక ఆ చిత్రానికి ఎక్కడాలేని క్రేజ్‌ వస్తుంది. ఎన్టీఆర్‌ పూరీ జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తాజాగా రాబోతున్న ‘టెంపర్‌’ ఆడియోతో పాటు ట్రైలర్స్‌ కూడా బాగా ఆకట్టుకుని ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇక పాటల్లో ఎన్టీఆర్‌ కొత్త కొత్త స్టెప్పులతో ఇరగదీస్తున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంతో ఎలాగైనా బ్లాక్‌బస్టర్‌ అందుకుని 50 కోట్ల క్లబ్‌లోకి చేరాలని ఎన్టీఆర్‌ ఉబలాటపడుతున్నాడు. మంచి సినిమా పడితే ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోకు 50 కోట్లు అనేది పెద్ద లెక్కకాదు. ఇక పూరీ విషయానికి వస్తే నాలుగైదు నెలల్లో సినిమాను పూర్తి చేసే పూరీ ‘టెంపర్‌’ చిత్రం కోసం ఏడాది నుండి కష్టపడుతున్నాడు. ఆయన తీసిన ‘హార్ట్‌ఎటాక్‌’ చిత్రం విడుదలై ఏడాది దాటుతోంది. మరి ఇన్నిరోజులు ‘టెంపర్‌’ పైనే దృష్టిపెట్టిన పూరీ, ఎన్టీఆర్‌కు ఏ రేంజ్‌ హిట్టిస్తాడో..ఫిబ్రవరి 13న తెలిసిపోనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ