మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ అంటూ పలు పేర్లు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. చివరగా ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు కూడా ఇదే టైటిల్‌ను ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజస్టర్ చేయించడంతో ఈ టైటిలే పక్కా అంటున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే అంటే మహాశివరాత్రి నాడు ఫస్ట్‌లుక్‌తో సహా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో మహేష్ సరసన ఓ ఐటంసాంగ్‌లో పోర్న్‌స్టార్ సన్నీలియోన్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే స్టార్ స్టేటస్ కోసం తంటాడు పడుతున్న మంచు మనోజ్ వంటి హీరోలతో సన్నీలియోన్ నటిస్తే ఓ అర్ధం ఉంటుంది, తద్వారా ఆ సినిమాలకు కాస్తంత పబ్లిసిటీ అయినా దక్కుతుంది. కానీ మహేష్ వంటి బిగ్‌స్టార్ చిత్రంలో సన్నీలియోన్‌ని ఏరికోరి పెట్టుకోవడం ఏమిటని అందరూ ప్రశ్నిస్తున్నారు. మహేష్‌కు ఇంత చీప్ పబ్లిసిటీ అవసరమా? శృతిహాసన్, పార్వతిమెల్టన్ వంటి వారు చేస్తే పరవాలేదు, కానీ సన్నీలియోన్ వంటి వారి సరసన మహేష్ చిందులేయాల్సిరావడం మహేష్ స్థాయికి తగదనే విమర్శలు ఇప్పుటు టాలీవుడ్‌లో వినబడుతున్నాయి.