Advertisementt

బ్రహ్మానందం ‘పెద్ద బాల శిక్ష’ కాదు! ఓ ఎన్‌సైక్లోపీడియా!

Mon 02nd Feb 2015 05:56 AM
brahmanandam,dasari,chiranjeevi,chalam  బ్రహ్మానందం ‘పెద్ద బాల శిక్ష’ కాదు! ఓ ఎన్‌సైక్లోపీడియా!
బ్రహ్మానందం ‘పెద్ద బాల శిక్ష’ కాదు! ఓ ఎన్‌సైక్లోపీడియా!
Advertisement

బ్రహ్మానందం ‘పెద్ద బాల శిక్ష’ కాదు, ఓ ఎన్‌సైక్లోపీడియా

ప్రముఖులతో ముఖాముఖీ :

ఆ ప్రముఖుల అభిప్రాయాలు ఎంత విలువైనవో, ఆ ముఖాముఖీలో సంధించే ప్రశ్నల పరంపర అంతకన్నా విలువైనవి.

ఫిబ్రవరి 1  ` బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ‘సాక్షి’ దినపత్రిక కొరకు పులగం చిన్నారాయణ అందించిన ‘మాటకచేరీ’ ఈ దశాబ్దంలో వెలువడిన గొప్ప ఇంటర్వ్యూలలో ఒకటి. పాలకడలిని చిలికినట్లు బ్రహ్మానందం అంతరంగాన్ని ఆవిష్కరించారు పులగం. మనకు తెలియని, మనం ఊహించని ఓ మహామేధావిని బ్రహ్మానందంలో చూపించారు. నిన్నటివరకు సినీరంగంలో ‘జీనియస్‌’ అంటే చార్లీ చాప్లిన్‌, చో రామస్వామి మాత్రమే నాకు కనిపించేవారు. కాదు మన బ్రహ్మానందంగారు వున్నారు ` అని కళ్ళముందు నిలిపిన పులగం గురించి ఎంత చెప్పినా తక్కువే. ధూర్జటినుంచి కొమ్మూరి వరకు తెలుగు సాహిత్యాన్ని ఔపోసన పట్టిన బ్రహ్మానందం, కర్ణుని మరణం చూడలేక చీకటికొండల్లోకి జారుకున్న సూర్యభగవానుణ్ణి ` శిలువెక్కిన ఏసయ్యని ` రాజ్యాన్ని, భార్యాబిడ్డలను విడిచివెళ్తున్న గౌతముడ్ని, కాటన్‌ దొరని ` ఆదిశంకరుని ` బమ్మెర పోతనని ` చలంని ` రమణ మహర్షిని ఒకరా ఇద్దరా ఎందరో మహానుభావుల్ని ఒకే వేదికమీదకు తీసుకొచ్చిన మహానుభావుడు బ్రహ్మానందంగారు. ఇంతగొప్ప ఆర్టికల్‌ అందించిన ‘సాక్షి’కి అభినందనలు. 

బ్రహ్మానందంగారిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన జయకృష్ణ గారికి, తొలి దినాలలో ఎంతగానో ప్రోత్సహించిన చిరంజీవి గారికి అలాగే జంధ్యాలగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

రాయలవారి కొలువులో అష్ట దిగ్గజాలున్నారు. తెలుగు సినీ సీమలో నటులుగా లబ్ధ ప్రతిష్టులయిన గొప్ప రచయితలు ` ఫిలాసఫర్స్‌ : కొంగర జగ్గయ్య, గొల్లపూడి, తణికెళ్ళ భరణి, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, దాసరి, పరుచూరి బ్రదర్స్‌, ఎమ్మెస్‌, ఎవియస్‌ తదితరులు గుర్తొస్తేచాలు మేను పులకిస్తోంది. బ్రహ్మానందంగారు నూరేళ్ళ నిండు జీవితాన్ని పండిరచాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ ` 

-తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement