'దేవదాసు' సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, రెడీ, కందిరీగ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన హీరో రామ్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'పండగ చేస్కో' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల నుండి వరుస ఫ్లాప్ లు అందుకుంటున్న రామ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ చిత్ర నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా కాలేదు. అందుకు కారణం ఈ సినిమా స్క్రిప్ట్ రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాన్ని పోలి ఉందని హీరో రామ్ కథలో మార్పులు చేయమని కోరారట. దీంతో షూటింగ్ కు కొంచెం గ్యాప్ వచ్చింది. స్క్రిప్ట్ అంతా ఓకే అయితే ఫిబ్రవరి మొదటి వారం నుండి చిత్ర నిర్మాణం మరలా ప్రారంభం చేస్తారట. ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్, రామ్ తో జత కట్టనుంది. ఈ సినిమా అయినా రామ్ కి కలిసి వస్తుందేమో వేచి చూడాలి.