నూతన దర్శకుడు చందుమొండేటి దర్శకత్వంలో నిఖిల్, స్వాతిరెడ్డి, రావురమేష్, తనికెళ్ళ భరణి.. తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిన్న చిత్రం 'కార్తికేయ' తెలుగునాట బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లోకి రీమేక్ చేసే ఉద్దేశ్యంతో పలువురు నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా ఏక్తాకపూర్, అతుల్ అగ్నిహోత్రిలు ఈ పోటీలో ముందున్నారట. రీమేక్ రైట్స్ కోసం వీరు కోటి రూపాయలు ఆఫర్ చేసినప్పటికీ తెలుగు నిర్మాతలు మాత్రం ఏ మాత్రం తొందరపడకుండా మంచి అమౌంట్ కోసం ఎదురుచూస్తూ ఇప్పటివరకు ఎవ్వరికీ హక్కులు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెడుతున్నారని సమాచారం.