Advertisementt

కల్లు తాగుతూ కనిపించిన హీరోయిన్..!

Sat 31st Jan 2015 02:52 AM
heroine sanjana,bujjigaadu,ravibabu,avunu2  కల్లు తాగుతూ కనిపించిన హీరోయిన్..!
కల్లు తాగుతూ కనిపించిన హీరోయిన్..!
Advertisement
Ads by CJ

పార్టీస్ లో హీరోయిన్స్ తాగడం అనే విషయం సర్వసాదారణంగా మారింది. రీసెంట్ గా అంజలి చేసిన అల్లరి మరువక ముందే ఇంకో హీరోయిన్ తాగుతూ కనిపించింది. పూరిజగన్నాథ్ 'బుజ్జిగాడు' సినిమాలో త్రిష చెల్లెలి పాత్రలో ఓకే అనిపించుకున్న నటి సంజన. ఆ తరువాత తెలుగులో చెప్పుకోదగ్గ హిట్స్ లేని ఈ సుందరి కన్నడ ఇండస్ట్రీని నమ్ముకుంది. ఇప్పుడు కన్నడలో టాప్ హీరోయిన్స్ కి ఎవరికీ ఇవ్వలేనంత పారితోషికం అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ కల్లు తాగుతూ కనిపించింది. మరి సరదా కోసం చేసిందో లేదా రోజు తాగే అలవాటు ఉందో తెలియదు కాని మొత్తానికి ఇలా తాగుతూ కనిపించింది. సంజన అనే పేరుతో కలిసి రావట్లేదని తన పేరులో మరొక అక్షరం చేర్చుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో రవిబాబు చేస్తున్న 'అవును 2' సినిమాలో ఓ పాత్రలో నటిస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ