గుణశేకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో అనుష్కతోపాటు అల్లుఅర్జున్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియోను ఫిబ్రవరి 17న, సినిమాను మార్చి 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఇక బాలయ్యకు నమ్మకాలు చాలా ఎక్కువ. ఆ సెంటిమెంట్ తోనే ఆయన తన తాజా చిత్రం 'ఎన్.బి.కె. లయన్'ను 'లెజెండ్' రిలీజ్ అయిన మార్చి 28నే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో కూడా ఫిబ్రవరి రెండో వారంలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ రోజున్న పరిస్థితుల్లో రెండు భారీ చిత్రాలు ఒకే వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. మరి ఏ చిత్రం విడుదల విషయంలో వెనక్కి తగ్గుతుందేమో చూడాలి...!