కామెడీ చిత్రాలను తీయడంలో తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు రేలంగి నరసింహారావు. ఆయన తీసిన ఎన్నో చిత్రాలు ఆణిముత్యాలుగా మనల్ని ఎల్లప్పుడూ నవ్విస్తూనే ఉంటాయి. ఇప్పటికి రాశిపరంగానే కాకుండా వాసి పరంగా కూడా ఆయన చేసిన చిత్రాలు అద్భుతాలే. 70 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన చాలా గ్యాప్ తర్వాత మరో చిత్రం తీయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ప్రధానపాత్రను చేయనుండగా, బ్రహ్మానందంతో పాటు ఓ కుక్కపిల్ల కీలకపాత్రను పోషించనుందట. తన పాత ఫామ్ లోకి రేలంగి తిరిగివస్తే ఈ సారి ఆయన సెంచరీ కొట్టడం ఖాయమంటున్నాయి పరిశ్రమవర్గాలు.