‘గోపాలగోపాల, ఐ’ వంటి చిత్రాలను కూడా కాదని ఈ ఏడాది విడుదలైన తొలి బ్లాక్‌బస్టర్‌గా కళ్యాణ్‌రామ్ ‘పటాస్’ చిత్రం కలిక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో నిర్మాతగానే కాదు..డిస్ట్రిబ్యూటర్‌గా కూడా పలు ప్లాప్‌లను ఎదుర్కొన్న దిల్‌రాజు సైతం ‘పటాస్’ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసి భారీ లాభాలను మూటగట్టుకుంటున్నాడు. ఈ చిత్రం బాగా రన్ అవుతుండటంతో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ హవా మరో వారం కొనసాగేందుకు దోహదపడ్డాడని అంటున్నారు. వాస్తవానికి ‘టెంపర్’ చిత్రాన్ని ఫిబ్రవరి 6నే విడుదల చేయాలని భావించినప్పటికీ దాన్ని 13కు ఎన్టీఆర్ వాయిదా వేయించాడని, దీంతో జనవరి 23 నుండి ఫిబ్రవరి 13 వరకు ‘పటాస్’కు తిరుగులేకుండా పోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 30న కొన్ని చిత్రాలు విడుదల అవుతున్నప్పటికీ అవేమీ పటాస్‌కు పోటీగా నిలిచేవి కావు. దీంతో ఈ సినిమా అందరికీ రుపాయికి రెండు రూపాయలు లాభం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. కళ్యాణ్‌రామ్ విజయోత్సవంతో మాట్లాడుతూ, అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తానని, అయితే అది రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదని, తాతగారి సినిమాలను తలపించే సినిమా అవుతుందని అంటున్నాడు.