Advertisementt

రానా స్వీట్ మెమొరీస్..!

Thu 29th Jan 2015 08:09 AM
baby movie promotion,rana daggubati,ram charan tej,exam fail  రానా స్వీట్ మెమొరీస్..!
రానా స్వీట్ మెమొరీస్..!
Advertisement
Ads by CJ

'బేబీ' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఆంగ్ల  పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో రానా మాట్లాడుతూ... నేను, రామ్ చరణ్, నాగ చైతన్య, అల్లుఅర్జున్ ముగ్గురం చిన్ననాటి స్నేహితులం. చిన్నతనం నుండి రామ్ చరణ్ నాకు తెలుసు. అతను 6వ తరగతిలో ఫెయిలైన విషయం నాకు ఇప్పటికి గుర్తుంది. నేను కూడా 10వ తరగతిలో ఫెయిలయ్యాను. నేను ఫేయిలయినందుకు తాతగారు పెద్దగా ఫీలవ్వలేదు. కానీ అమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో చిన్న గొడవ కూడా జరిగింది. నాకు కోపం వచ్చి నా చదువు.. నా ఇష్టం... అని అనేశాను. అమ్మకు కోపం వచ్చి చెంప పై ఒక్కటిచ్చింది.. అంటూ బోల్డ్ గా తన చిన్ననాటి విశేషాలు చెప్పుకొచ్చాడు. మొత్తం మీద రామ్ చరణ్ 6వ తరగతిలో ఫెయిలవ్వడం, రానా 10వ తరగతి ఫెయిలవ్వడం వంటి వాటిని రానా నిర్మోహమాటంగా చెప్పడం విశేషం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ