ఇటీవల కాలంలో ప్రేమకధాచిత్రమ్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లవర్స్' వంటి అనేక చిత్రాల్లో కమెడియన్ గా అదరగొట్టిన సప్తగిరి త్వరలో హీరోగా మారబోతున్నట్లు సమాచారం. తెలుగులో కమెడియన్స్ గా రాణించి హీరోలుగా రాణించలేక, చివరకు కమెడియన్స్ గానే స్థిరపడిన అనేక మంది మన ముందు ఉదాహరణగా ఉన్నారు. అయితే అలాంటి తప్పును సప్తగిరి చేస్తున్నాడా? కమెడియన్ గా మంచి రేంజ్ కు చేరుకుంటున్న ఆయన అనవసరంగా హీరోగా అవతారం ఎత్తుతున్నడా? అనే సందేహాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఆయన హీరోగా నటించే చిత్రాన్ని 'శ్రేయాస్ మీడియా సంస్థ'తో కలిసి మారుతికి సంబంధించిన గుడ్ సినిమా గ్రూప్ సంస్థ నిర్మించనుందని, దర్శకునిగా మారుతి శిష్యుడు పరిచయం కానున్నాడని సమాచారం. ఈ చిత్రానికి 'ఆరడుగుల బుల్లెట్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ టైటిల్ ప్రముఖ భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎస్. ప్రసాద్ దగ్గర ఉంది.