Advertisementt

బొబ్బిలి పులిగా మారనున్న తారక్..!

Wed 28th Jan 2015 02:04 PM
   బొబ్బిలి పులిగా మారనున్న తారక్..!
బొబ్బిలి పులిగా మారనున్న తారక్..!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్ కు తన తాత అంటే చాలా ఇష్టం.. గౌరవం.. అయితే తన ప్రతి చిత్రంలోనూ తాతగారి ప్రస్తావన, వంశాల మీద పంచ్ డైలాగులు వేయడం, వయసుకు మించిన చిత్రాలను, క్యారెక్టర్లను ఎంచుకోవడం, ఇలా ప్రతి విషయంలోనూ ఆయన రాంగ్ స్టెప్స్ వేస్తుండటంతో వాటిని ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్-పూరీజగన్నాధ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో కోటశ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లను ఎన్టీఆర్ నిలదీసే సీన్ ను పూరీ డిజైన్ చేశాడట. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టి ఆ సీన్ ను కోర్టు సీన్ కు మార్పించివేశాడని తెలుస్తోంది. 'బొబ్బిలిపులి' చిత్రంలో తన తాతపై వచ్చే కోర్టు సీన్ తరహాలో ఈ సీన్ ఉండాలని తారక్ బలవంతం చేయడంతో పూరీ అలానే చేశాడని సమాచారం. మరి ఎంతో వయసు, అనుభవం, ఇమేజ్ వంటివి సాధించిన తర్వాతనే అలాంటి పవర్ ఫుల్ సీన్ ను దాసరి తెరకెక్కించాడు. అందులోను స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి సరైన నాందిగా  'బిబ్బిలిపులి'లోని ప్రతి సీన్ ను ఎన్టీఆర్ -దాసరి డిజైన్ చేసుకున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ మరీ ఇంత చిన్న వయసులోనే అలాంటి బరువైన, అద్బుతమైన సీన్ ను తనపై తీయాలని పట్టుబట్టడం ఎంతవరకు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్లుగా మారుతుందేమో చూడాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ