ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ మరోసారి జగన్ దీక్ష చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోని చంద్రబాబు.. తన వర్గానికి చెందిన మీడియా ద్వారా మాత్రం ఆ పథకాలన్ని సక్రమంగా అమలవుతున్నట్లు చూపిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి ధర్నాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ.. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులు, డ్వాక్రామహిళలు, నిరుద్యోగులను కూడా తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. ఈ మోసాలను ప్రజలకు తెలియజెప్పడానికి తణుకులో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపడుతున్నఉట్లు చెప్పారు. అయితే గతంలో కూడా పలుమార్లు జగన్ ప్రజా సమస్యలపై దీక్షలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకపోయింది. మరి ఈసారైనా జగన్ దీక్ష ప్రభుత్వంలో ఏదైన కదలిక తీసుకొస్తుందేమో వేచి చూడాలి.