దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే సినిమా వాళ్లకు ముఖ్యంగా హీరోయిన్లకు వర్తించినంతగా ఎవ్వరికి వర్తించదనే చెప్పాలి. గ్లామర్, డిమాండ్ ఉండగానే రెమ్యూనరేషన్ ను పెంచేయాలని వారు ఆశిస్తూ ఉంటారు. హీరోయిన్ల రన్ టైం కూడా చాలా తక్కువ కావడంతో వారిని ఈ విషయంలో తప్పుపట్టడానికి వీలులేదు. ఓవర్ నైట్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా పొందిన రకుల్ ప్రీత్ సింగ్ 'లౌక్యం, కరెంటుతీగ' చిత్రాల తర్వాత తన పారితోషికాన్ని డబుల్ చేయడం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. సినిమాకు 25 లక్షలు తీసుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం 50 లక్షలు ఇవ్వందే ఏ సినిమా అయినా, ఏ హీరో సరసన అయినా ఒప్పుకోవడం లేదని ఇండస్ట్రీ టాక్. అన్నట్లు ఆమె ప్రస్తుతం తెలుగులో రామ్ సరసన 'పండగచేస్కో', రవితేజ సరసన 'కిక్2' చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఎన్టీఆర్-సుకుమార్ ల చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.