Advertisementt

మహేష్ కు ఇష్టమైన ప్రాంతంలో షూటింగ్..!

Wed 28th Jan 2015 06:00 AM
mahesh babu,koratala direction,pollaachi,sreemanthudu  మహేష్ కు ఇష్టమైన ప్రాంతంలో షూటింగ్..!
మహేష్ కు ఇష్టమైన ప్రాంతంలో షూటింగ్..!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, పూణే పరిసర ప్రాంతాలలో జరిగింది. ఇప్పుడు ఈ చిత్ర బృందం  పొల్లాచిలో షూటింగ్  జరపనున్నారు. ఫిబ్రవరి నుంచి ఒక నెల రోజుల పాటు చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ ఆ ప్రాంతంలో జరగనుంది. ఇండియా లో మహేష్ కు ఇష్టమైన ప్రాంతమైన పొల్లాచిలో చిత్రీకరణ చేయనుండడం ఆయనకు చాలా ఆనందంగా ఉందట. '1 నేనొక్కడినే' , 'ఆగడు' ఫ్లాప్ లతో 2014 వ సంవత్సరం మహేష్ కు కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో ఎలాగైనా కొరటాల చిత్రంతో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు మహేష్. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని మే మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో మహేష్ సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా, జగపతిబాబు మహేష్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ