Advertisementt

వారం వ్యవధిలో రెండు చిత్రాలు రెడీ..!

Wed 28th Jan 2015 05:07 AM
dhanush,anegan,shamithabh,tankaamaari song  వారం వ్యవధిలో రెండు చిత్రాలు రెడీ..!
వారం వ్యవధిలో రెండు చిత్రాలు రెడీ..!
Advertisement
Ads by CJ

అనుకోకుండా తమిళ స్టార్ ధనుష్ నటిస్తున్న రెండు చిత్రాలు వారం వ్యవధిలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఆయన బాలీవుడ్ లో నటించిన రెండో చిత్రం 'షమితాబ్' ఫిబ్రవరి 6న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో ఆయన అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ధనుష్, అమైరా దస్తూర్, కార్తిక్ ముఖ్యపాత్రల్లో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అనేగన్' చిత్రం ఫిబ్రవరి 13న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలోని 'టంకామారి...' అనే పాట ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒక్కరోజు ముందు ఈ చిత్రం విడుదలవుతోందని దర్శకుడు కె.వి.ఆనంద్  అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలే ఉండటంతో ధనుష్ అభిమానులు ఉత్కంటగా ఎదురుచూస్తున్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ