Advertisementt

రానా కోరిక..!

Wed 28th Jan 2015 04:58 AM
rana,guest roles,bollywood,baby movie hit talk,director  రానా కోరిక..!
రానా కోరిక..!
Advertisement
Ads by CJ

నటునిగా రానా పరిస్థితి ఏమిటి? అనే విషయంలో ఎంతో సీనియర్లు కూడా నటునిగా ఆయన గమనాన్ని  ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. వరుస పెట్టి గెస్ట్ రోల్స్ వంటివి వస్తున్నప్పటికీ ఆయనకు ఇప్పటికి సోలో హీరోగా హిట్ లేదు. అయితే ఆయనకు టాలీవుడ్ ను దాటి కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా మంచి గుర్తింపు లభిస్తోంది. తాజాగా ఆయన ఓ గెస్ట్ రోల్ చేసిన 'బేబీ' చిత్రం విడుదలై మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ... తనకు దర్శకత్వం వహించాలని ఉంది.. అంటూ సెలవిచ్చాడు. నటునిగా స్థిరపడకుండానే డైరెక్షన్ పై మోజు ఏమిటా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఆయన భవిష్యత్తులో నిర్మాతగా కూడా కొనసాగుతానని అంటున్నాడు. మొత్తానికి ఆయన కెరీర్ రెండు మూడు పడవల మీద అయితే కష్టమని ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ గా చెప్పుకునే రామ్ చరణ్, అల్లుఅర్జున్, నాగచైతన్య వంటి వారు అయినా సలహా ఇస్తే బాగుంటుందని అంటున్నారు. రానా తన కెరీర్ గురించి, తాను చేయబోయే చిత్రాల గురించి ఎక్కువగా రామ్ చరణ్, బన్ని, చైతూలతో  డిస్కస్ చేస్తానని చెప్పుకొచ్చాడు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ