సాధారణంగా నిప్పులేనిదే పొగరాదని మన పెద్దలు అంటారు. కానీ సినిమా ఫీల్డ్ లో మాత్రం నిప్పు లేకపోయినా పొగ వస్తుంది. అయితే తాప్సి విషయంలో అది తప్పుగా రుజువైంది. ఆమె టాలీవుడ్ లో నటించినంత కాలం ఆమెపై వచ్చిన రూమర్స్, గాసిప్స్ చాల తక్కువే అని చెప్పాలి. అయితే ఈ అమ్మడు ఆల్ రెడీ డేటింగ్ చేస్తోందట. మరి తాప్సి విషయంలో నిప్పు ఉన్న కూడా పొగ రాలేదని ఒప్పుకోవాలి. ఆమె తాజాగా బాలీవుడ్ లో నటించిన 'బేబీ' ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని బయట పెట్టింది. అయితే ఆమె డేటింగ్ చేస్తున్న వ్యక్తి సినిమా ఫీల్డ్ కు సంబంధించిన వాడు కాదట..! పేరు మాత్రం చెప్పనంటోంది. మరి తాప్సి టాలీవుడ్ మీడియాకు ఏమాత్రం చిక్కకుండా ఇంత రహస్యం ఎలా మెయిన్ టెయిన్ చేస్తుందో అని అందరు ఆశ్చర్య పోతుంటే.. కొందరు మాత్రం ఇది పబ్లిసిటీ కోసం ఆమె చెబుతున్న ఉత్తుత్తి కబుర్లంటూ కొట్టిపారేస్తున్నారు.