Advertisementt

రాజాంలో పవన్ కళ్యాణ్ పర్యటన..!

Wed 28th Jan 2015 04:34 AM
  రాజాంలో పవన్ కళ్యాణ్ పర్యటన..!
రాజాంలో పవన్ కళ్యాణ్ పర్యటన..!
Advertisement
Ads by CJ

జనసేన పార్టీ స్థాపించి, గత ఎన్నికల్లో తన ఉపన్యాసాలతో ప్రజలకోసం నేనున్నానంటూ భరోసా కల్పించిన హీరో పవన్ కళ్యాణ్. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయాలలో అంత యాక్టివ్ గా లేని పవన్ కళ్యాణ్ , సడన్ గా శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో పర్యటన చేస్తూ మరోసారి ప్రజల్లోకి వచ్చారు. పవన్ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఆయనపై అభిమానాన్ని కురిపించారు. దీంతో రాజాంలో రాజకీయ వాతావరణం నెలకొంది. కానీ పవన్ కళ్యాన్ రాజకీయాల తరపున కాకుండా ఒక సేవా కార్యక్రమం కోసం రాజాం వెళ్ళారు. జి.ఎమ్.ఆర్ గ్రూప్ సంస్థల ఆహ్వానం మేరకు రాజాంలో జి.ఎమ్.ఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ లో ఉన్న రోగులను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళినట్లుగా సమాచారం. రీసెంట్ గా శ్రీజ విషయంలోనూ తాజాగా ఈ సంఘటనతో పవన్ ప్రజలకు అత్యంత చేరువయ్యే సమయం అతి దగ్గరలోనే ఉందని తెలుస్తుంది. తమ నాయకుడు ఇలా ప్రజల్లోకి రావడంతో పవన్ ఫాన్స్ కూడా చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ