ఏపీకి ప్రత్యేకహోదా దక్కే అవకాశాలు ఇక లేనట్లే కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా దక్కితే రాయితీలు, పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని ప్రజలు భావించారు. అయితే ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఏపీకి స్పెషల్ స్టెటస్ ఇవ్వడానికి సుముఖత చూపడం లేదు. ఇక ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి కూడా ప్రయోజనం లేదని భావిస్తున్న చంద్రబాబు ఈ విషయమై టీడీపీ మంత్రులకు హితబోధ చేశాడు. ఇక ప్రత్యేక హోదా కోసం పోరాడటం కంటే కూడా శాఖలవారీగా కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకురావడానికి ప్రయత్నించాలని కూడా చెప్పాడు. ఇక స్పెషల్ స్టేటస్ గురించి మీడియాతో మాట్లాడవద్దని, బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయవద్దని కూడా బాబు సూచించినట్లు సమాచారం. తమకు బీజేపీ తగిన గౌరవం ఇవ్వడం లేదని తెలిసి కూడా చంద్రబాబు వెనక్కి తగ్గుతుండటం వెనుక పెద్ద మతలబే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.