Advertisementt

కళ్యాణ్ రామ్ కు బంపర్ ఆఫర్..!

Tue 27th Jan 2015 04:55 AM
poori jagannadh,kalyan ram,jr.ntr temper,patas,bumper offer  కళ్యాణ్ రామ్ కు బంపర్ ఆఫర్..!
కళ్యాణ్ రామ్ కు బంపర్ ఆఫర్..!
Advertisement
Ads by CJ

ఏ హీరో హీరోయిజాన్ని అయినా తనదైన స్టైల్ లో చేయాలంటే అది పూరీ జగన్నాధ్ కే సాధ్యం.  టైటిల్ నుండి డైలాగ్స్,  డైలాగ్ మాడ్యులేషన్, తనదైన పంచ్ లతో ఆయన ఏ హీరోకైనా స్టార్ స్టేటస్ తీసుకొని రాగలడు.  అందుకే అందరు హీరోలు ఆయన డైరెక్షన్ లో ఓ సినిమా అయినా చేయాలనుకుంటారు. కాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా త్వరలో పూరీ ఓ చిత్రాన్ని చేయనున్నాడని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ తో, రానాతో, వరుణ్ తేజ్ తో.. ఇలా చాలా పేర్లు పూరీ లిస్ట్ లో ప్రచారంలోకి రావడంతో ఇప్పుడే అది వీలయ్యే అవకాశం లేదనుకున్నారు. వరుణ్ తేజ్ క్రిష్ తో, మహేష్ శ్రీ కాంత్ అడ్డాలతో ఇలా ఎవ్వరికి వారు బిజీ కావడంతో నందమూరి కళ్యాణ్ రామ్ కు అనుకోని అవకాశం వచ్చినట్లయింది. వాస్తవానికి నిర్మాత ఇబ్బంది కూడా లేదని, తానే నిర్మాతగా హీరోగా ఓ చిత్రం చేయమని కళ్యాణ్ రామ్ పూరీని చాలా కాలం కిందటే  అడిగాడట. దీనికి తోడు ప్రస్తుతం పూరీ తన తమ్ముడు ఎన్టీఆర్  తో సినిమా చేస్తుండటం, కళ్యాణ్ రామ్ -ఎన్టీఅర్ ల మధ్య కూడా సత్సంబంధాలు ఉండటం, పూరీకి ఎన్టీఆర్ తో కూడా 'టెంపర్'తో మంచి అనుబంధం ఏర్పడటంతో 'టెంపర్' పూర్తయిన వెంటనే  ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాతగా, హీరోగా పూరీ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. పూరీ చిత్రం అంటే అది మాగ్జిమమ్ రెండు మూడు నెలల్లో పూర్తవుతుంది కాబట్టి పూరీకి కూడా ఈ విషయంలో నో ప్రాబ్లమ్. ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే 'పటాస్' హిట్ తో ఎంతో హ్యాపీగా ఉన్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా మరో బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ