Advertisementt

నటీనటులనే కాదు.. టైటిల్ ను కూడా మార్చారు..!

Tue 27th Jan 2015 04:51 AM
geethanjali,sequel,director raj kiran,tripura,swathi  నటీనటులనే కాదు.. టైటిల్ ను కూడా మార్చారు..!
నటీనటులనే కాదు.. టైటిల్ ను కూడా మార్చారు..!
Advertisement
Ads by CJ

హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన 'గీతాంజలి' చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి భాగంలో టైటిల్ పాత్రను పోషించిన అంజలి, బ్రహ్మానందం, తెరవెనుక పనిచేసిన కోనవెంకట్ వంటి వారిని పక్కన పెట్టి అదే దర్శకుడు రాజ్ కిరణ్ ఈ చిత్రానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. మొదటి భాగం బాగా హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ కు 'గీతాంజలి 2' అనే టైటిల్ పెట్టాలని భావించినప్పటికీ అలా పెడితే  సినిమా విడుదలకు ముందే అంచనాలు పెరిగి అసలుకే మోసం వస్తుందని, అంతేకాక అదే టైటిల్ పెడితే ఆ కధకు కొనసాగింపుగా రెండో భాగాన్ని భావిస్తున్నారని, తెలుగులో ఇలా చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం వల్ల.. ఇలా పలుకారణాలతో  ఈ చిత్రం టైటిల్ ను 'త్రిపుర' అని పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో కలర్స్ స్వాతి లీడ్ రోల్ పోషిచనుంది. ఆమె క్యారెక్టర్ పేరు బాలా త్రిపుర సుందరి కాబట్టి 'త్రిపుర' పేరును పెడితేనే అన్ని విధాల మంచిదని యూనిట్ భావిస్తోందట...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ