Advertisementt

అనిల్ కూడా ఆ స్థాయికి ఎడుగుతాడా..?

Tue 27th Jan 2015 04:45 AM
anil ravipudi,nandamoori kalyan ram,patas,balakrishna  అనిల్ కూడా ఆ స్థాయికి ఎడుగుతాడా..?
అనిల్ కూడా ఆ స్థాయికి ఎడుగుతాడా..?
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్ రామ్ కు పదేళ్ల తర్వాత సైలెంట్ హిట్ ఇచ్చిన  రచయిత, దర్శకుడు అనిల్  రావిపూడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దర్శకునిగా తొలిచిత్రం అయినప్పటికీ ఎక్కడా ఎంటర్ టైన్ మెంట్ మిస్ కాకుండా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'పటాస్' చిత్రాన్ని తీర్చిదిద్దిన ఆయనపై అందరు అభినందనలు కురిపిస్తున్నారు. మాస్ పల్స్, సక్సెస్ ఫార్ములాను మిస్ కాకుండా ముందుకెళ్లి పెద్ద హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడికి వరుస ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా చాలా మందికి తొలి అవకాశం ఇచ్చినప్పటికీ ఆయనకు తొలి హిట్ ఇచ్చి 'అతనొక్కడే' చిత్రం ద్వారా సక్సెస్ ను అందించిన సురేంద్రరెడ్డి  ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. అదే తరహాలో కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి కూడా మంచి స్థాయికి ఎదుగుతాడని అంటున్నారు. కాగా తన రెండో చిత్రాన్ని బయటి బేనర్ లో చేయనున్న అనిల్ రావిపూడి మరల తన మూడో  చిత్రాన్ని కళ్యాణ్ రామ్ బేనర్ లోనే బాలకృష్ణ తో చేయనున్నాడని వినిపిస్తోంది. బాలయ్య కు అనిల్ 'పటాస్'కు ముందే ఓ స్టోరీ చెప్పాడని, 'పటాస్' హిట్ తర్వాత దాన్ని బాలయ్య ఓకే చేశాడని టాక్. ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తానని కళ్యాణ్ రామ్ మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం బాలయ్య 101వ చిత్రం అవుతుందని అంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో ఈ కర్చీఫ్ ల కల్చర్ ఆగేది కాదని విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ