Advertisementt

తమిళంలో శైవం.. తెలుగులో 'దాగుడుమూత దండాకోర్'..!

Tue 27th Jan 2015 04:40 AM
saivam,krish,daagudumoota dandacore,rajendra prasad  తమిళంలో శైవం.. తెలుగులో 'దాగుడుమూత దండాకోర్'..!
తమిళంలో శైవం.. తెలుగులో 'దాగుడుమూత దండాకోర్'..!
Advertisement
Ads by CJ

తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'శైవం' చిత్రాన్ని తెలుగులో డైరెక్టర్ క్రిష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆయన ఉషాకిరణ్ మూవీస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్ర లో నటిస్తున్న  ఈ చిత్రానికి ఆర్.కె.మలినేని దర్శకత్వం వహిస్తుండగా, ఇ.ఎస్.మూర్తి సంగీతాన్ని అందిస్తున్నాడు. 'నాన్న' చిత్రంతో ఆకట్టుకున్న సారా అర్జున్ కీలక  పాత్ర పోషిస్తోంది. మానవ సంబంధాలు, పల్లెటూరి అందాలు, తాత మనవరాళ్ళ అనుబంధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'దాగుడుమూత  దండాకోర్' అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేసారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా పలు మార్పులతో రూపొందుతున్న ఈ చిత్రానికి అచ్చ తెలుగు టైటిల్ ను పెట్టి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రిష్ అభినందనీయుడనే చెప్పాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ