Advertisementt

నిర్మాతల్ని లెక్కచేయని మహేష్..!

Tue 27th Jan 2015 04:36 AM
aagadu flop. mahesh koratala movie,summer release,peroducers  నిర్మాతల్ని లెక్కచేయని మహేష్..!
నిర్మాతల్ని లెక్కచేయని మహేష్..!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. 'ఆగడు' ఫ్లాప్ కావడంతో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు పేరుతో ఈ చిత్రం ప్రారంభం చాలా ఆలస్యమైంది. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా వేసవికి తీసుకొని రావాలనే పట్టుదలతో మహేష్ ఉన్నట్లు సమాచారం. సమ్మర్ ను దాటిపోతే మరల తన సినిమాకు మంచి సీజన్ దసరానే కాబట్టి అంత వెయిట్ చేయకుండా వేసవికే బరిలోకి దిగాలని ఫిక్స్ అయిన మహేష్ బాబు ఈ చిత్రాన్ని తొందరగా షూట్ చేయమని కొరటాల శివను ఆదేశించాడట. దర్శకుడు కొరటాల మాత్రం కొంత ఆలస్యం అవుతుందని, తన కెరీర్ కు ఇది పెద్ద ల్యాండ్ మార్క్ చిత్రం అవుతుందనే ఉద్దేశ్యంతో ఆచితూచి షూటింగ్ ను చేస్తున్నాడని తెలుస్తుంది. కానీ మహేష్ బాబు కోరికపై ఈ చిత్రం షూటింగ్ ను మరింత వేగవంతం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కావాలంటే నాన్ స్టాప్ షెడ్యుల్ కూడా చేయడానికి మహేష్ సిద్దపడటంతో ఆయన మాట కాదనలేని స్థితిలో కొరటాల ఉన్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. నిర్మాతలు కొత్తవారు కావడంతో వారి అభిప్రాయానికి మాత్రం విలువ లేకుండా పోయిందని, అంత మహేష్,  కొరటాలే నిర్ణయించుకుంటున్నారని,నిర్మాతల పరిస్థితి ఆటలో అరటిపండు మాదిరిగా తయారైందని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ