Advertisementt

మారుతి కి మంచి అవకాశం!

Sun 25th Jan 2015 03:16 PM
maruthi,nani,geetha arts,uv creations,maruthi director  మారుతి కి మంచి అవకాశం!
మారుతి కి మంచి అవకాశం!
Advertisement
Ads by CJ

దర్శకునిగా, సమర్పకునిగా లో బడ్జెట్ చిత్రాలను తీసి ఘనవిజయాలు నమోదు చేసి సంచలనం సృష్టించిన మారుతి ఆ తర్వాత కెరీర్ పరంగా వెనకబడిపోయాడు. అడల్ట్ మూవీస్ ను తీస్తాడనే చెడ్డపేరుతోపాటు ఒక స్థాయి హీరోలను సరిగ్గా హ్యాండిల్ చేయలేడనే విమర్శలను మూటగట్టుకున్నాడు. తాజాగా ఆయన తన కెరీర్ లో కీలక పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. త్వరలో ఆయన నాని హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.  ఈ చిత్రం ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని జోనర్ లో ఉంటుందంటున్నాడు.  కాగా ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ బేనర్ గీతాఆర్ట్స్ తో పాటు యు. వి. క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఫిబ్రవరి 5 నుండి పట్టాలెక్కించనున్నట్లు  తెలుస్తోంది. తెలుగు, తమిళ  భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న  ఈ చిత్రంలో శ్రీ విద్యను హీరోయిన్ గా  ఫైనల్ చేసినట్లు సమాచారం. మరి ఈ చిత్రం నాని కంటే మారుతికి మరింత కీలకం కానుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ