పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ 'జానీ'. ఈ చిత్రానికి పవన్ కళ్యాణే దర్శకత్వం వహించాడు. సినిమా ఫ్లాప్ కావడంతో పవన్ ఎంతో మనోవేదన అనుభవించాడు... డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల నుండి ఎంత ఒత్తిడి ఆయన ఎదుర్కొన్నాడు అనేది ఓ ఇంటర్వ్యూలో పవనే స్వయంగా వివరించాడు. ఆయన మాట్లాడుతూ... జయాపజయాలు ఎప్పుడు పట్టించుకోను. రెండింటికి అతీతంగా ఉండాలని ప్రయతిస్తుంటాను. సినీ పరిశ్రమ పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతుంటాయి. హిట్టయితే అందలం ఎక్కిస్తారు. ఫ్లాపయితే తిడతారు. 'జానీ' సినిమా నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆ సినిమా ఫ్లాపయిన తర్వాత కొందరు నన్ను క్రిమినల్ ను చూసినట్లు చూశారు. ఒక్క ఫ్లాప్ తో మనుషులు ఇలా మారిపోయారేంటి అనిపించింది. దీంతో హిట్లు ఫ్లాప్ లకు ఒకేలా స్పందించడం అలవాటు చేసుకున్నాను.. అని చెప్పుకొచ్చాడు పవన్.