Advertisementt

కిక్ ఇచ్చే లుక్ కి ఫిక్స్ అయిపోండి!

Sun 25th Jan 2015 01:44 PM
kick 2,first look,kalyan ram,raviteja,january 26  కిక్ ఇచ్చే లుక్ కి ఫిక్స్ అయిపోండి!
కిక్ ఇచ్చే లుక్ కి ఫిక్స్ అయిపోండి!
Advertisement
Ads by CJ

రవితేజ ఇమేజ్ ను పీక్ స్టేజీకి తీసుకెళ్లి... దర్శకుడు సురేంద్రరెడ్డికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన చిత్రం 'కిక్'. ఇదే చిత్రం బాలీవుడ్ లోకి కూడా రీమేక్ అయి, అక్కడ కూడా రికార్డులు బద్దలుకొట్టింది. కాగా ఇప్పుడు అదే కాంబినేషన్లో  'కిక్2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ తమ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై తానే నిర్మాతగా నిర్మిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో  ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను జనవరి 26న అంటే రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే రోజు రవితేజ బర్త్ డే  కావడంతో ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. మరి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ