టీడీపీలో లోకేష్‌బాబు పెత్తనంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏకంగా మంత్రులు కూడా లోకేష్‌బాబు మాట వినకతప్పని పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినబడుతున్నాయి. సచివాలయంలో కూర్చొని లోకేష్‌బాబు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే వాదనలు వినబడుతున్నాయి. ఇదే సమయంలో కొందరు మంత్రులు మాత్రం లోకేష్‌బాబును వెనకేసుకొస్తున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య లోకేష్‌బాబు సమన్వయకర్తలాగా పనిచేస్తున్నారని మంత్రి గంటాశ్రీనివాసరావు చెబుతున్నారు. స్మార్ట్ విలేజ్‌లో భాగంగా తాను సేకరించిన సమాచారాన్ని లోకేష్‌బాబు తమతో పంచుకుంటున్నాడని ఆయన చెప్పారు. ఇన్నాళ్లుగా టీడీపీలో కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్తగానే లోకేష్ పనిచేస్తున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆయన్ను పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా కూడా మార్చారు.