Advertisementt

త్రివిక్రమ్ మార్క్ టైటిల్..!

Sun 25th Jan 2015 06:56 AM
julayi,allu arjun,trivikram,son of sathyamurthy  త్రివిక్రమ్ మార్క్ టైటిల్..!
త్రివిక్రమ్ మార్క్ టైటిల్..!
Advertisement
Ads by CJ

'జులాయి' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ, దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం టైటిల్ అంటూ పలు పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఈ టైటిల్స్ ఏవీ త్రివిక్రమ్ మార్క్ లో లేవన్నవి అందరూ అంగీకరించే విషయం. ఎట్టకేలకు ఈ చిత్రానికి 'సన్నాఫ్ సత్యమూర్తి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. చిత్రం మొత్తం తండ్రి కొడుకుల అనుబంధం చుట్టూ తిరిగే స్టోరీ కావడంతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే విధంగా టైటిల్ ఉండాలని త్రివిక్రమ్ భావించడమే దీనికి కారణం అని తెలుస్తుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువవుతుందని భావిస్తున్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఇదే స్టైల్ ను ఫాలో అయి సక్సెస్ అయిన త్రివిక్రమ్  మరోసారి మరో స్టార్ హీరో చిత్రానికి కూడా సాఫ్ట్ టైటిల్ ను పెట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. కాగా ఈ చిత్రంలో సమంతా, ఆదాశర్మ, నిత్యా మీనన్ లతో పాటు రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రం విడుదలకానుంది.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ