నందమూరి బాలకృష్ణ కు నమ్మకాలు, అదృష్టం వంటి వాటితో పాటు అభిమానం కూడా ఎక్కువే. ఇప్పటికే ఆయన హీరోయిన్ నయనతారతో రెండు సినిమాల్లో నటించాడు. 'సింహా, శ్రీ రామరాజ్యం' సినిమాల్లో బాలయ్యకు జోడీగా నయనతార నటించి మెప్పించింది. 'శ్రీరామరాజ్యం' తర్వాత అయితే బాలయ్య మాట్లాడుతూ.. సీతగా నయనతార ఒప్పుకోకపోయి ఉంటే అసలు ఈ సినిమా చేసి ఉండే వాడినే కాదు.. అన్నాడు. తాజాగా బాలకృష్ణ తన 99వ చిత్రంగా 'లౌక్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి స్టార్ రైటర్స్ కోనవెంకట్, గోపీమోహన్ లు రచన చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సివుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.మరి ముచ్చటగా మూడో సారి నటిస్తున్న ఈ జంట ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది..!