ఒక డబ్బింగ్ సినిమాతో తెలుగు వారికి సుపరిచితమైన తెలుగు అమ్మాయి ఆ సినిమా తరువాత మల్టీ స్టారర్ చిత్రంలో నటించి తనకంటూ ఒక రేంజ్ సంపాదించుకుంది. రీసెంట్ గా ఒక హర్రర్ సినిమాలో నటించి తను తప్ప ఆ పాత్రకు వేరెవరు న్యాయం చేయలేరనిపించుకుంది. తెలుగు లో మంచి పేరు సంపాదించుకున్న ఈ సుందరి శుక్రవారం హైదరాబాద్ లో ఒక పబ్ లో తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టపట్టాలు వేసుకొని కనిపించింది. మద్యం సేవించి ఉన్న తనను చూసిన ఒక పేజ్ త్రీ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న బౌన్సర్లతో ఫోటోగ్రాఫర్ తో ఘర్షణకు దిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు.