మహేష్ బాబు బావ సుధీర్ బాబు, నందిత జంటగా లగడపాటి శ్రీధర్ నేతృత్వంలో లగడపాటి శిరీష నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. కన్నడ చిత్రం 'చార్మినార్'కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కన్నడ ఒరిజినల్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వం వహిస్తుండగా, నాగచైతన్య, రానా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మహేష్ బాబు కూడా కొన్ని నిమిషాల పాటు వెండితెరపై కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం టైటిల్ కు అనుగుణంగా ఈ మూవీ ఆడియో వేడుకను విజయవాడలో ఈనెల 25న జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మహేష్ బాబు వస్తాడని, అందుకోసం అక్కడి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి మహేష్ కు విజయవాడతో అవినాభావ సంబంధం ఉంది. మరి ఇక ఇదే నిజమైతే విజయవాడ మహేష్ అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు.