ప్రస్తుతం బాలీవుడ్ లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవితచరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అజారుద్దీన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషిస్తున్నాడు. టోనీ డిసౌజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ బయోపిక్ లో అజారుద్దీన్ క్రీడాజీవితం, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం, అజార్ వ్యక్తిగత జీవితంతో పాటు మరెన్నో కీలక అంశాలు తెరకెక్కనున్నాయి. కాగా ఈ చిత్రంలో నటించేందుకు సారీ.. సారీ.. జీవించేందుకు ఇమ్రాన్ హష్మీ క్రికెట్ లోని మెలకువలను తెలుసుకుంటున్నాడట. మరీ ముఖ్యంగా అజారుద్దీన్ ఆటలోని మెలకువలను ఆయన ఎంతో కష్టపడి నేర్చుకుంటున్నట్లు సమాచారం. తద్వారా ఈ చిత్రంలో తన పాత్రకు పూర్తి నయం చేయడం కోసం ఇమ్రాన్ హష్మీ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ రోజూ ఫిట్ నెస్ వ్యాయామాలు కూడా చేస్తున్నాడని తెలుస్తోంది.