Advertisementt

సిద్ధమవుతోన్న 'బాహుబలి'..!

Fri 23rd Jan 2015 05:57 AM
bahubali,prabhas,anushka,rana,ramyakrishna,rajamouli  సిద్ధమవుతోన్న 'బాహుబలి'..!
సిద్ధమవుతోన్న 'బాహుబలి'..!
Advertisement
Ads by CJ

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ ద్విపాత్రాభినయంతో అనుష్క, రానా, రమ్యకృష్ణ, తమన్నా వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటివరకు ఫస్ట్ లుక్స్, మేకింగ్ వీడియోల ద్వారా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం మొదటి బాగాన్ని ఏప్రిల్ లో వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చిన దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం టీజర్ ను ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేసేందుకు సనాహాలు చేస్తున్నాడట. ఇందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ టీజర్ నిడివి 100 సెకండ్లు ఉంటుందని తెలుస్తోంది. మరి ఇది తెలుగు సినీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది? ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుంది? అనేది వేచి చూడాల్సిన విషయం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ