Advertisementt

నాగ్ తో నటించనున్న బుల్లితెర యాంకర్..!

Thu 22nd Jan 2015 05:45 AM
nagarjuna,soggade chinni nayana,item song,pawan kalyan,attharintiki daredi  నాగ్ తో నటించనున్న బుల్లితెర యాంకర్..!
నాగ్ తో నటించనున్న బుల్లితెర యాంకర్..!
Advertisement
Ads by CJ

ఈమధ్యకాలంలో విభిన్నచిత్రాలను  అంగీకరించాలని నిర్ణయించుకున్న నాగార్జున తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ లో కళ్యాణ్ కృష్ణ అనే నూతన దర్శకుని పరిచయం చేస్తూ 'సోగ్గాడే చిన్ని నాయన' టైటిల్ తో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నాడని, తాత, మనవడుగా కనిపిస్తాడని కొద్దిపాటి ఫాంటసీని మిక్స్ చేసి ఈ చిత్రం రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నాగ్ పోషించే ఓ పాత్రకు రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించనుండగా, కుర్ర నాగార్జునకు జోడీగా లావణ్య త్రిపాఠి ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో లక్కీ ఐటంగర్ల్ హంసానందిని ఓ ఐటంసాంగ్ చేయడంతోపాటు ఓ కీలకపాత్రను కూడా పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ కూడా ఓ పాటలో నర్తించనుందని, ఆమె నాగ్ కు మరదలి పాత్ర చేయనుందని సమాచారం. ఓ పాటతో పాటు ఆమెకు నాగ్ తో కొన్ని అల్లరి సీన్లు, బావామరదళ్ళ రొమాన్స్ కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఆమెకు ఐటం సాంగ్ లో ఛాన్స్ వచ్చినప్పటికీ తిరస్కరించిన ఆమెపై పవన్ అభిమానులు అప్పుడు మండిపడ్డారు. పవన్ తో చేయనని చెప్పిన ఆమె నాగ్ వంటి వయసుమళ్ళిన హీరోతో రొమాన్స్ చేయడానికి ఎలా ఒప్పుకుంది? అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ