Advertisementt

సిద్ధాంతాలు వదలని కామ్రేడ్..!

Thu 22nd Jan 2015 05:32 AM
  సిద్ధాంతాలు వదలని కామ్రేడ్..!
సిద్ధాంతాలు వదలని కామ్రేడ్..!
Advertisement
Ads by CJ

మొదటి నుండి తనకు నచ్చిన తాను మెచ్చిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. కాగా ఆయన తీసిన చిత్రాలు ఇటీవల కాలంలో పెద్దగా ఆడటం లేదు. అయినా కూడా తన పంధా మార్చుకోవడం లేదు. నారాయణమూర్తి అంటే  పరిశ్రమలో అందరికీ గౌరవం ఉంది. ఎంతో సాదాసీదా జీవితాన్ని గడిపే ఆయనంటే టాప్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కు చాలా ఇష్టం. దీంతో ఆయన తాజాగా ఎన్టీఆర్ తో తీస్తున్న 'టెంపర్' చిత్రంలో ఓ కీలకమైన పాత్రను క్రియేట్ చేసి నారాయణమూర్తిని చేయమని అడిగాడట. దీనికి మంచి పారితోషికాన్ని కూడా ఆఫర్ చేశాడని తెలుస్తోంది. అయితే మొదట్లో ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన నారాయణమూర్తి ఆ తర్వాత తన సిద్దాంతాలను వదిలి కేవలం కమర్షియల్ చిత్రాల్లో వేషం వేయడం మనస్కరించక ఆ పాత్రను చేయనని చెప్పాడని తెలుస్తోంది. మొత్తానికి సిద్దాంతాల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే వారు ఇప్పటికీ ఉన్నందుకు మనందరం గర్వపడాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ