Advertisementt

రామ్ చరణ్ సినిమాకు నిర్మాత అతనే..!

Thu 22nd Jan 2015 05:11 AM
ram charan,surendrareddy,racegurram,allu aravind producer  రామ్ చరణ్ సినిమాకు నిర్మాత అతనే..!
రామ్ చరణ్ సినిమాకు నిర్మాత అతనే..!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ హీరోగా త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. కాగా ఈ చిత్రానికి కోనవెంకట్, గోపీమోహన్ లు రచయితలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బేనర్ లో అల్లుఅరవింద్ నిర్మించనున్నట్లు సమాచారం. గతంలో అల్లు అరవింద్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన 'మగధీర' చిత్రం ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో అందరికీ తెలుసు. మరి ఈ తాజా చిత్రం మరెన్ని సంచలనాలను నమోదు చేస్తుందో వేచి చూడాల్సివుంది. అల్లుఅర్జున్ తో తీసిన 'రేసుగుర్రం' చిత్రం అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో సురేంద్రరెడ్డి కి రామ్ చరణ్, అల్లు అరవింద్ లు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు.  మరి ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని సురేందర్ ఏమేరకు నిలబెట్టుకుంటాడో వేచిచూడాల్సివుంది. రామ్ చరణ్-శ్రీనువైట్ల చిత్రం పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. కాగా సురేంద్రరెడ్డి ప్రస్తుతం రవితేజతో 'కిక్2' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే రామ్ చరణ్ సినిమాపై దృష్టి కేంద్రీకరించనున్నాడు.              

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ